Inter Exams:తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఎప్పటినుంచంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నామని వెల్లడించింది. ఇంగ్లీష్ థియర్ పరీక్షకు 80 మార్కులు.. ప్రాక్టికల్ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్..
28-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
01-03-2024: ఇంగ్లీష్ పేపర్-I
04-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IA, బాటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
06-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
11-03-2024: ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
13-03-2024: కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్-I
15-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
18-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-I, జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ ..
29-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
02-03-2024: ఇంగ్లీష్ పేపర్-II
05-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IIA, బాటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
07-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
12-03-2024: ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
14-03-2024: కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
16-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
19-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout