IAS and IPS officers:కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జాబితా ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎన్నికల విధుల నుంచి కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన సంగతి తెలిసిందే. వారి స్థానంలో కొత్తగా అధికారులను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఈసీ పంపించిన జాబితాలోని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు. ఈ క్రమంలో వారు బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్య..
ప్రస్తుతం పోలీసు అకాడమీ డైరెక్టర్గా ఉన్న సందీప్ శాండిల్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా క్రిస్టినా నియామకం అయ్యారు. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా భారతీ హోలీకేరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా గౌతమ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా హన్మంత్, నిర్మల్ జిల్లా కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్ బాధ్యతలు చేపట్టారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీగా రాహుల్ హెగ్డే..
నిజామాబాద్ పోలీసు కమిషనర్గా కల్మేశ్వర్, జగిత్యాల జిల్లా ఎస్పీగా సంప్రీత్ సింగ్, సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరి రూపేష్, కామారెడ్డి జిల్లా ఎస్పీగా సింధూ శర్మ, మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీగా వైభవ్ రఘునాథ్, జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీగా రితిరాజ్, మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పాటిల్ పంగ్రామ్సింగ్ గణపతిరావ్, నారాయణపేట్ జిల్లా ఎస్పీగా యోగేష్ గౌతమ్, భూపాలపల్లి జిల్లా ఎస్పీగా కిరణ్ ప్రభాకర్, సూర్యాపేట జిల్లా ఎస్పీగా రాహుల్ హెగ్డే నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తియ్యే వరకు వీరు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout