సహనం కోల్పోయిన మహమూద్ అలీ.. గన్‌మెన్ చెంప చెల్లుమనిపించిన హోంమంత్రి
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మంత్రులు బహిరంగంగా ప్రవర్తిస్తు్న్న తీరు వివాదాస్పదమవుతోంది. తోటి ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల పట్ల వారి ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలకు హాజరైన ఆయన.. తలసానిని ఆప్యాయంగా అలింగనం చేసుకున్నారు. అనంతరం శుభాకాంక్షలు చెప్పేందుకు బొకే ఇవ్వాలని గన్‌మెన్‌ను అడిగారు. అయితే బొకే ఇవ్వడం లేట్ అవ్వడంపై సహనం కోల్పోయిన మంత్రి గన్‌మెన్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వెంటనే కలుగజేసుకున్న తలసాని పోనిలేండి అంటూ సర్దిచెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి రక్షణ బాధ్యతలు చూసే సిబ్బందిపై ఇలా చేయి చేసుకోవం ఏంటని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
బైంసా ఏఎంసీ ఛైర్మన్‌ను వెనక్కి లాగేసిన మంత్రి తలసాని..
గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్ కుమార్ బాబును కోసం వెనక్కి నెట్టేసిన ఘటన పెద్ద దుమారం రేపింది. దీంతో తలసాని ఈ ఘటనపై వివరణ ఇస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. జనం రద్దీ బాగా ఉండటంతో అనుకోకుండా ఆయన బూటుతో తన కాలును తొక్కడంతో రక్తస్రావమైందని.. ఆ బాధలో ముందున్న వ్యక్తిని వెనక్కి లాగానని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఆయనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని క్షమాపణలు కూడా చెప్పానని మంత్రి తెలిపారు.
ఎమ్మెల్యే తలపై కొట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..
ఇక ఇటీవల మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఓ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను తలపై కొట్టిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి.. ఎమ్మెల్యే తలపై కొట్టడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వకుండా మంత్రి ఇలా వ్వవహరించటంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
ఓడిపోతామనే భయంతోనే ఇలా ప్రవర్తిస్తు్న్నారని ప్రతిపక్షాల విమర్శలు..
తాజాగా మంత్రి మహమూద్ అలీ గన్‌మెన్‌పై చేయి చేసుకోవడంతో మంత్రులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓడిపోతామనే భయంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షాలు కౌంటర్లు వేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments