సహనం కోల్పోయిన మహమూద్ అలీ.. గన్‌మెన్ చెంప చెల్లుమనిపించిన హోంమంత్రి

  • IndiaGlitz, [Friday,October 06 2023]

ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మంత్రులు బహిరంగంగా ప్రవర్తిస్తు్న్న తీరు వివాదాస్పదమవుతోంది. తోటి ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల పట్ల వారి ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలకు హాజరైన ఆయన.. తలసానిని ఆప్యాయంగా అలింగనం చేసుకున్నారు. అనంతరం శుభాకాంక్షలు చెప్పేందుకు బొకే ఇవ్వాలని గన్‌మెన్‌ను అడిగారు. అయితే బొకే ఇవ్వడం లేట్ అవ్వడంపై సహనం కోల్పోయిన మంత్రి గన్‌మెన్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వెంటనే కలుగజేసుకున్న తలసాని పోనిలేండి అంటూ సర్దిచెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి రక్షణ బాధ్యతలు చూసే సిబ్బందిపై ఇలా చేయి చేసుకోవం ఏంటని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

బైంసా ఏఎంసీ ఛైర్మన్‌ను వెనక్కి లాగేసిన మంత్రి తలసాని..

గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్ కుమార్ బాబును కోసం వెనక్కి నెట్టేసిన ఘటన పెద్ద దుమారం రేపింది. దీంతో తలసాని ఈ ఘటనపై వివరణ ఇస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. జనం రద్దీ బాగా ఉండటంతో అనుకోకుండా ఆయన బూటుతో తన కాలును తొక్కడంతో రక్తస్రావమైందని.. ఆ బాధలో ముందున్న వ్యక్తిని వెనక్కి లాగానని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఆయనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని క్షమాపణలు కూడా చెప్పానని మంత్రి తెలిపారు.

ఎమ్మెల్యే తలపై కొట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

ఇక ఇటీవల మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఓ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను తలపై కొట్టిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి.. ఎమ్మెల్యే తలపై కొట్టడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వకుండా మంత్రి ఇలా వ్వవహరించటంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.

ఓడిపోతామనే భయంతోనే ఇలా ప్రవర్తిస్తు్న్నారని ప్రతిపక్షాల విమర్శలు..

తాజాగా మంత్రి మహమూద్ అలీ గన్‌మెన్‌పై చేయి చేసుకోవడంతో మంత్రులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓడిపోతామనే భయంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షాలు కౌంటర్లు వేస్తున్నాయి.

More News

Kodali Nani: పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదు... కొడాలి నాని ఘాటు విమర్శలు

వారాహి యాత్ర సభలో వైసీపీ ప్రభుత్వం రూపాయి పావలా ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు.

TDP Fake Survey: సీఎం జగన్ దూకుడుతో కదులుతున్న తెలుగుదేశం పునాదులు.. ఫేక్ సర్వేలకు దిగుతున్న పచ్చ మీడియా

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఎవర్ని అడిగినా చెబుతారు.

Telangana Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఖరారు.. డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు..!

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. సెమీ ఫైనల్స్‌గా భావించే ఈ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల

Khushbu:రోజాపై బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఖుష్భూ.. క్షమాపణలు చెప్పే వరకు పోరాటం చేస్తా

మంత్రి రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటి,

KTR:సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. స్వయంగా విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి టిఫిన్

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.