తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య కూడా తీవ్ర స్థాయిలో నమోదవుతోంది. ప్రతి మూడు టెస్టులకు ఒక పాజిటివ్ ఉండటం ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. అయితే తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. కాగా గత రాత్రి కరోనా టెస్టులు నిర్వహించగా మహమూద్ అలీకి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రిలో చేరారు.
ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. మరోసారి హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. నివేదిక వచ్చిన అనంతరం అవసరమైతే లాక్‌డౌన్ విధిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments