తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్

  • IndiaGlitz, [Monday,June 29 2020]

తెలంగాణలో కరోనా రోజు రోజుకూ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య కూడా తీవ్ర స్థాయిలో నమోదవుతోంది. ప్రతి మూడు టెస్టులకు ఒక పాజిటివ్ ఉండటం ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. అయితే తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. కాగా గత రాత్రి కరోనా టెస్టులు నిర్వహించగా మహమూద్ అలీకి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రిలో చేరారు.

ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. మరోసారి హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. నివేదిక వచ్చిన అనంతరం అవసరమైతే లాక్‌డౌన్ విధిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

More News

హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్.. భయపడాల్సిందేమీ లేదన్న కేసీఆర్

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌కు సమయం  ఆసన్నమైంది. రోజు రోజుకూ జీహెచ్ఎంసీ పరిధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో

'స‌రిగ‌మగ‌మ' లిరిక‌ల్ సాంగ్‌తో ఆకట్టుకుంటోన్నరాజ్‌ తరుణ్ ‘ఒరేయ్‌ బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ను కెలుకుతున్న వ‌ర్మ‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను, అత‌ని అభిమానుల‌ను వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌కు ప‌బ్లిసిటీ కావాల్సిన‌ప్పుడల్లా కెలుకుతుంటాడు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలకు బ్రేకేసిన కరోనా

ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయమై గతంలో చర్చలు నడిచాయి.

ప్రమాదం అంచున డయాబెటిస్ రోగులు..

ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే కరోనా నుంచి బయటపడటం చాలా కష్టమని వైద్యులు వెల్లడిస్తూనే ఉన్నారు.