Prof Kodandaram: తెలంగాణ హైకోర్టులో ప్రొఫెసర్ కోదండరామ్‌కు షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా 2023 జూలై 31న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను అప్పటి కేసీఆర్ సర్కార్ గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరి పేర్లను ఆమోదించలేమని ప్రభుత్వానికి తెలిపారు. గవర్నర్ నిర్ణయాన్ని వారిద్దరు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.
మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను గవర్నర్ తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్తానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయకుండా యథాతథ స్థితి కొనసాగిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.
తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. దీంతో ఆయన తెలంగాణ జన సమితి పార్టీని పెట్టుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో కోదండరామ్ లాంటి ప్రొఫెసర్ సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారు. అలాగే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కోదండరామ్‌కు విద్యాశాఖ మంత్రిగా నియమించనున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో కోదండరామ్‌ను మంత్రి పదవి వరిస్తుందో లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout