Vanama Venkateswara Rao:వనమా ఎన్నిక చెల్లదు .. తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం

  • IndiaGlitz, [Tuesday,July 25 2023]

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని వనమాపై అభియోగాలు నమోదుయ్యాయి. అంతేకాదు.. వనమా గెలుపును సవాల్ చేస్తూ జలగం వెంకట్రావు హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. 2014లో వనమా దాఖలు చేసిన అఫిడవిట్‌కు, 2018లో సమర్పించిన అఫిడవిట్‌కు తేడా వుందని జలగం ఆరోపించారు. ఆస్తులను సరిగా వెల్లడించలేదని వెంకట్రావు వెల్లడించారు.

వనమాపై కోర్టును ఆశ్రయించిన జలగం :

ఇవి నిర్థారణ కావడంతో వనామా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాదు.. జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. డిసెంబర్ 12, 2018 నుంచి ఎమ్మెల్యేగా జలగంను డిక్లేర్ చేస్తూ తీర్పు వెలువరించింది. అలాగే తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు గాను వనమా వెంకటేశ్వరరావుకు రూ.5 లక్షలు జరిమానా విధించింది. 2018 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి వనమా పోటీచేశారు. వనమాపై 4,139 ఓట్ల తేడాతో వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ కారణాలతో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2019 మార్చిలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.

కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వనమా :

ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంను తన అడ్డాగా చేసుకున్నారు. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వనమా.. ఆ తర్వాత మళ్లీ 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. తిరిగి 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

More News

Superstar Krishna:కృష్ణకు ఘననివాళి.. బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ విగ్రహావిష్కరణ, ఎప్పుడంటే..?

సూపర్‌స్టార్ కృష్ణ కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ గతేడాది నవంబర్ 15న తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

AP CM YS Jagan:పెత్తందార్లపై పేదల ప్రభుత్వం గెలిచింది .. ఇకపై ఇది అందరి అమరావతి : సీఎం వైఎస్ జగన్

అమరావతి ఇకపై అందరిదీ అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు సీఎం సోమవారం భూమి పూజ నిర్వహించారు.

Pawan Kalyan:జగన్ పర్యటనలో చెట్ల నరికివేత .. ‘‘అందమును హత్య చేసెడి హంతకుండా’’ , వృక్షాలు విలపిస్తున్నాయి అంటూ పవన్ ట్వీట్

గత కొంతకాలంగా వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన దూకుడు మరింత పెంచారు.

Botsa Satyanarayana:బైజూస్‌పై విమర్శలు .. పవన్.. నీకు ట్యూషన్స్ చెబుతా, ఈ హోంవర్క్ చేయ్ : బొత్స సెటైర్లు

ఇప్పటికే వాలంటీర్లపై వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న పవన్ కల్యాణ్.. నిన్న బైజూస్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

RajahmundryBridge: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జిపై ఆ వాహనాల ప్రవేశంపై నిషేధం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెనపై అధికారులు ఆంక్షలు విధించారు.