టీఎస్పీఎస్సీని క్లోజ్ చేయాలనుకుంటున్నారా?: హైకోర్టు ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ పబ్లిక్ కమిషన్‌కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరుద్యోగి జె.శంకర్ వేసిన పిల్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. టీఎస్పీఎస్సీలో ఎలాంటి సభ్యులు లేరని పిటిషనర్ పేర్కొన్నారు. పబ్లిక్ కమిషన్‌లో ఒక్కరు మాత్రమే ఉండడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. పబ్లిక్ కమిషన్‌ను క్లోజ్ చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది. తెలంగాణ పబ్లిక్ కమిషన్ చాలా ముఖ్యమైనదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. చైర్మన్, సభ్యులను నియమించకపోతే.. టీఎస్పీఎస్సీ మూసివేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. చైర్మన్, సభ్యులను నియమించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కమిషన్ సభ్యుల నియామకాలు చేపడుతామని హైకోర్టుకు ఏజీ వెల్లడించారు.పిల్ పై విచారణను హైకోర్టు జూన్ 17కి వాయిదా వేసింది.
మరోవైపు తెలంగాణలో 30న కర్ఫ్యూ ముగియనుండటంతో అనంతరం తీసుకోబోయే చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. అటు కర్ఫ్యూ అనంతరం తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నిస్తునే.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటితో కర్ఫ్యూ ముగియనుంది.. తదుపరి చర్యలు ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆకాశం విరిగి మీద పడినా ఎన్నికలు ఆపరా? అంటూ ఈసీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఎన్నికలా? అని నిలదీసింది. ఇటు కర్ఫ్యూ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చివరి నిమిషం వరకూ ఆలోచించేది లేదా? అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout