Raghavendra Rao:దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇండస్ట్రీ అవసరాల కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సొంత అవసరాలకు వాడుకున్నారని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాఘవేంద్రరావుతో పాటు కుటుంబసభ్యులకు నోటీసులు ఇచ్చింది.
1984లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాఘవేంద్రరావు ఫ్యామిలీకి బంజారాహిల్స్‌లో రెండు ఎకరాల స్థలాన్ని రాయితీ ధరకు కేటాయించింది. బంజారాహిల్స్ సర్వే నంబర్ 403/1లో ఎకరా రూ.8500 చొప్పున ప్రభుత్వం విక్రయించింది. అయితే ఈ స్థలంలో రికార్డింగ్, రీ-రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలనే షరతు ఉందని.. అలాగే 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మిని థియేటర్, ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఒక కాన్ఫరెన్స్ హాలు నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చిందని బాలకిషన్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. అయితే రాఘవేంద్రరావు ఫ్యామిలీ మాత్రం ఆ స్థలంలో ఆర్కే సినీ ప్లెక్స్ పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించిందని తెలిపారు.
దీనిపై 2012లో బాలకిషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. గతేడాది విచారణ చేపట్టిన న్యాయస్థానం రాఘవేంద్రరావుతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది. కానీ ఈ నోటీసులపై స్పందించలేదు. దీంతో ఈ కేసుపై తాజాగా విచారణ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం రాఘవేంద్రరావు, ఆయన సోదరుడు కృష్ణమోహనరావు తదితరులకు మరోసారి నోటీసులు జారీ చేస్తూ జనవరి మూడో వారం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇక వయసు పైబడటంతో సినిమాలకు కొంత కాలం నుంచి దూరంగా ఉంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోయిన్‌గా పెళ్లి సందడి సినిమాను తన దర్శక పర్యవేక్షణలో తెరకెక్కించారు. ఇందులో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. తనదైన మార్క్‌తో ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకుల నుంచి పాజిటిల్ రెస్పాన్స్ వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments