ఎర్రబుగ్గ కార్ల వాడకం... తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
రోడ్డుపై ఎర్రబుగ్గ కార్లలో ప్రయాణించాలని చాలా మంది కల. ఇందుకోసం ఎంతో కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా, రాజకీయ నాయకులుగా మారి తమ లక్ష్యాన్ని అందుకుంటారు. కానీ కొందరు మాత్రం అర్హత లేకపోయినా ఎర్రబుగ్గను కార్లపై పెట్టుకుని, హారన్ మోగిస్తూ జనానికి ఇబ్బంది కలిగిస్తూ వుంటారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేకపోయినా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకుని తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
2017లో ఎర్రబుగ్గల వాడకంపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా చాలా మంది అధికారులు, రాజకీయ నాయకులు ఎర్రబుగ్గ కార్లను ఉపయోగిస్తున్నారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన న్యాయవాది భావనప్ప హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
మోటారు వాహనాల చట్టం 119 సెక్షన్‌కు వ్యతిరేకంగా పలువురు ఎర్రబుగ్గ కార్లు వినియోగిస్తున్నారని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వీటివల్ల తోటి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని... ధ్వని కాలుష్యం కూడా భారీగా పెరుగుతుందని పిటిషనర్ వాదించారు. అలాగే ఎర్రబుగ్గ కార్ల వినియోగంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోర్టుకి విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి కార్లు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com