Telangana High Court:అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే ఆయన పిటిషన్‌ను పిల్(ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఈ అభ్యంతరాలపై విచారణ జరిపిన జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ ధర్మాసనం పిటిషన్‌ను పిల్‌గా మార్చేందుకు అంగీకరించింది. పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు జారీ చేసింది.
పిల్ నంబర్ కేటాయించడం ఖరారు కావడంతో తదుపరి విచారణల్లో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? సీబీఐకి, సీబీఐ కోర్టుకు ఎలాంటి ఆదేశాలను ఇవ్వబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ అక్రమాస్తుల కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సీబీఐ కోర్టును ఆదేశిస్తే జగన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ హరిరామజోగయ్య పిల్ దాఖలు చేశారు. 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోపు కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని కోరారు.
అంతకుముందు సుప్రంకోర్టులోనూ జగన్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆయన అక్రమాస్తుల కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ ఆలస్యానికి కారణాలేంటో చెప్పాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అలాగే రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout