తెలంగాణలో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
- IndiaGlitz, [Monday,June 29 2020]
తెలంగాణలో సచివాలయం కూల్చివేత వివాదంలో హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఈ తీర్పు ఉండటంతో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. మంత్రి మండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంటూ సచివాలయ కూల్చివేతపై దాఖలైన పిటిషన్లంటినీ హైకోర్టు కొట్టివేసింది.
కాగా నూతన సచివాలయ నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయి. వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్లు వేసింది. దీనిపై ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. అలాగే సచివాలయ నిర్మాణమనేది విధానపరమైన నిర్ణయమని.. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం వాదించింది. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు నేడు ప్రభుత్వానికి అనుకూలంగా తుది తీర్పును వెలువరించింది.