అధికారులంతా కోర్టుకు హాజరవ్వాల్సిందే: కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు ఫైర్

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

కరోనా పరీక్షల నిర్వహణ నుంచి మొదలుకొని ఎన్ని కిట్లిచ్చారు? ఎందుకు టెస్టులు నిలిపివేశారు? తదితర విషయాల్నింటిపై తెలంగాణ హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. 17వ తేదీలోగా అన్నింటినీ సరిదిద్దుకోవాలని లేదంటే జులై 20న చీఫ్ సెక్రటరీ మొదలు.. ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ సహా అంతా హైకోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. 50 వేల టెస్టులు చేస్తామన్న ప్రభుత్వం.. మూడు రోజుల పాటు అసలు టెస్టులే నిర్వహించకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ తీరు జీవించే హక్కును కాలరాసే విధంగా ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ఏడీ బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే పరీక్షలు చేయాలని అదేశాలు జారీ చేసింది. ‘మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? డాక్టర్స్‌కు, పారమెడికల్ స్టాఫ్‌కు పీపీఈ కిట్స్ ఎన్ని ఇచ్చారు? జూన్ 26న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలి’ అని హైకోర్టు అదేశించింది.

More News

నితిన్ పెళ్లి తేది, వేదిక ఖ‌రారు !

నితిన్ ఇంత వ‌ర‌కు త‌న పెళ్లి డేట్‌ను ఖ‌రారైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జూలై 26న హైద‌రాబాద్ ఫ‌ల‌క్‌నామా ఫ్యాలెస్‌లో నితిన్‌, షాలినిల పెళ్లి జ‌ర‌గ‌నుంది.

నటి పూర్ణ కేసు విచారణలో మరో కొత్త విషయం వెలుగులోకి..

నటి పూర్ణ(షామ్నా ఖాసిం) కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పూర్ణను బెదిరించిన ముఠాతో మలయాళ నటుడు ధర్మజన్‌ బోల్‌గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా

హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షల కోసం సంప్రదించాల్సిన కేంద్రాలివే..

హైదరాబాద్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

వారికి గుడ్‌న్యూస్.. రూ.10 వేలున్న జీతాన్ని 28 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

ప్రపంచంలో వాళ్లకో ప్రత్యేక స్థానముంది. పలు సందరభాల్లో వారు చూపిన చొరవకు ప్రపంచమే ఫిదా అయిపోయింది.

ఉదయ్ కిరణ్ చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’ ఇన్నాళ్లకు ఓటీటీలో విడుదల

స్టార్ హీరో ఉదయ్ కిరణ్ చివరి సినిమా ఇన్నాళ్లకు విడుదలకు నోచుకుంది. ఉదయ్ మరణం ఎంతో మంది అభిమానులను కలచివేసింది. ‘చిత్రం’