అధికారులంతా కోర్టుకు హాజరవ్వాల్సిందే: కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా పరీక్షల నిర్వహణ నుంచి మొదలుకొని ఎన్ని కిట్లిచ్చారు? ఎందుకు టెస్టులు నిలిపివేశారు? తదితర విషయాల్నింటిపై తెలంగాణ హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. 17వ తేదీలోగా అన్నింటినీ సరిదిద్దుకోవాలని లేదంటే జులై 20న చీఫ్ సెక్రటరీ మొదలు.. ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ సహా అంతా హైకోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. 50 వేల టెస్టులు చేస్తామన్న ప్రభుత్వం.. మూడు రోజుల పాటు అసలు టెస్టులే నిర్వహించకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ తీరు జీవించే హక్కును కాలరాసే విధంగా ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ఏడీ బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే పరీక్షలు చేయాలని అదేశాలు జారీ చేసింది. ‘మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? డాక్టర్స్‌కు, పారమెడికల్ స్టాఫ్‌కు పీపీఈ కిట్స్ ఎన్ని ఇచ్చారు? జూన్ 26న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలి’ అని హైకోర్టు అదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments