ఈటల భూ కబ్జా వాస్తవమే.. 3 గంటల్లో నివేదిక: కలెక్టర్ హరీష్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తిన ఘటన శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అనంతరం దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆఘమేఘాలపై విచారణకు ఆదేశించారు. నేడు సంబంధిత అధికారులు మెదక్ జిల్లా అచ్చంపేటకు చేరుకుని విచారణ నిర్వహించారు. విచారణ ఫలితం కూడా అంతే ఆఘమేఘాలపై వచ్చేసింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో మంత్రి ఈటల రాజేందర్ భూ వివాదంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ నిర్వహించారు.
అచ్చంపేటలో విజిలెన్స్ విచారణ తీరును కలెక్టర్ హరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూమి ఉందని విచారణలో తేలిందన్నారు. ఫీల్డ్ వర్క్ పూర్తయ్యాక నివేదిక ఇస్తామన్నారు. అసైన్డ్ భూముల కబ్జా విషయం వాస్తవమేనని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. మూడు గంటల్లో సర్వే పూర్తవుతుందని.. వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నామని వెల్లడించారు. అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. బాధితులకు అన్యాయం జరిగిందని... ప్రస్తుతం 117 ఎకరాల్లో సర్వే కొనసాగుతోందని కలెక్టర్ హరీష్ వెల్లడించారు.
నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్ పాల్ కరోనాతో మృతి
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గులాబీ పార్టీకి తామే ఓనర్లమని స్పష్టం చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లే బదులు పిలిచి అడిగితే సంతోషించేవాడినన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నానన్నారు. వారిద్దరూ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఈటల వాపోయారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కథనాలు సైతం ఆగడం లేదన్నారు. తమ పత్రికలు, ఛానెళ్లు తనపై వరుస కథనాలు ప్రచురించడం బాధ కలిగించాయన్నారు. అయినా అదరను, బెదరనని.. విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చాక భవిష్యత్ నిర్ణయంపై ఆలోచిస్తానని ఓ మీడియా ఛానెల్‌కు ఈటల రాజేందర్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com