TS Group-1: తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్ రద్దు.. TSPSC కీలక నిర్ణయం..

  • IndiaGlitz, [Monday,February 19 2024]

తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ మరోసారి రద్దైంది. గత ప్రభుత్వం విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్న TSPSC బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో కీలకమైన పోస్టులను భర్తీ చేసేందుకు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో జాయింట్ కలెక్టర్, డీఎస్పీ స్థాయి పోస్టులు ఉంటాయి. అయితే తెలంగాణ ఏర్పడిన దగ్గరి నుంచి ఇంతరవకు ఒక్క గ్రూప్-1 పోస్టు కూడా భర్తీ కాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. తర్వాత ఫలితాలు కూడా విడుదల చేశారు. కానీ అనూహ్యంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు భగ్గుమన్నాయి. దీంతో ఈ ఎగ్జామ్ రద్దు చేశారు.

అనంతరం మరోసారి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. అయితే 2023 జూన్ 11న నిర్వహించిన ఈ పరీక్షలోనూ అవకతవకలు జరిగాయని, నిబంధనలు సరిగ్గా పాటించలేదని మరోసారి రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. దీంతో అభ్యర్థులు విషయం హైకోర్టుకు వెళ్లడంతో ఎగ్జామ్ రద్దు నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశ్రయించింది. కేసు విచారణలో ఉండగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. చైర్మన్‌తో పాటు మొత్తం బోర్డు సభ్యులను తొలగించారు. అనంతరం కొత్త బోర్డును ఏర్పాటుచేశారు. బోర్డు చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించారు. అలాగే గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా ఇటీవల మరో 60 పోస్టులకు కూడా రేవంత్ సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో కొత్త పోస్టులతో కలిపి మొత్తం 563 పోస్టుల భర్తీకి త్వరలోనే టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

More News

Pawan Kalyan: మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. సముచిత స్థానం కల్పిస్తాం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని.. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Revanth Reddy: ఏపీ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. టీ కొట్టులు, కటింగ్ షాపులు, హోటల్స్‌లో ఏ ఇద్దరు కలిసినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి మధ్యే ప్రధాన పోటీ

Kodali Nani: గుడివాడ వైసీపీలో ఫ్లెక్సీల కలకలం.. కొడాలి నానికి చెక్ పెట్టనున్నారా..?

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు పట్టుమని రెండు నెలలు కూడా లేకపోవడంతో పార్టీలన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Chandrababu:ప్లేస్, టైం చెప్పు.. ఎక్కడికైనా వస్తా.. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్

ఏపీలో ఎన్నికల సమయకం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Siddham:దద్దరిల్లిన రాప్తాడు 'సిద్ధం' సభ.. విషపురాతలకు తెరదీసిన ఎల్లోమీడియా..

ఎటూ చూసినా జనమే.. ఎక్కడ విన్నా జగనే.. మండుంటెడను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నాయకుడి కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనప్రవాహం.