Krishnam Raju: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • IndiaGlitz, [Sunday,September 11 2022]

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటుల్లో ఒకరైన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్‌ షాక్‌కు గురైంది. అనేక మంది ప్రముఖులు కృష్ణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు సంతాపం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కృష్ణంరాజు మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు : కేసీఆర్

తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో కృష్ణంరాజు కథానాయకుడిగా నటించి, విలక్షణమైన నటనతో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారని కేసీఆర్ తన సందేశంలో తెలిపారు. ఆయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కృష్ణంరాజు అంతిమ సంస్కారాలపై సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.

కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియానికి కృష్ణంరాజు భౌతికకాయం :

మరోవైపు... కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఏఐజీ ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంకు తరలించనున్నారు. అక్కడ అభిమానులు, ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం కృష్ణంరాజు భౌతికకాయాన్ని అందుబాటులో వుంచనున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత రెబల్ స్టార్ అంత్యక్రియలు జరగనున్నాయి.

More News

Krishnam Raju: నాయకుడిగా, నటుడిగా ఆయన సేవలు ఆదర్శనీయం : కృష్ణంరాజు మృతిపట్ల మోడీ సంతాపం

తెలుగు సినీ దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Krishnam Raju: అసలు కృష్ణంరాజు మరణానికి కారణమేంటీ..?

తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్‌గా, అలనాటి అగ్రనటుల్లో ఒకరిగా విశేష ప్రజాదరణ వున్న కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.... శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అలనాటి నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు

Geetha Sakshigaa: క్యూరియాసిటీ ని పెంచుతున్న "గీత సాక్షిగా" ఫస్ట్ &సెకండ్ లుక్ పోస్టర్స్

సినిమా అనేది శక్తివంతమైన కళారూపం. సమాజంలోని సత్యాన్ని మరియు కఠినమైన వాస్తవాలను ప్రేక్షకులకు

Akasha Vani Visakhapatnam Centre: 'ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం' నుంచి సెకెండ్ లిరికల్ సాంగ్ విడుదల

శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన  హీరోహీరోయిన్లుగా మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి,