'జార్జ్‌రెడ్డి' కి తెలంగాణ ప్రభుత్వం షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `జార్జ్‌రెడ్డి`. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నవంబర్ 22న విడుదల కానుంది. 1965 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ విద్యార్థి నాయకుడైన జార్జ్ రెడ్డిని అప్పటి కాలేజ్ గొడవల్లో కొంత మంది దుండగులు హత్య చేశారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. `దళం` దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. అప్పట్లో ఉస్మానియా కాలేజ్‌లో జరిగే అన్యాయాలను ఎదిరించి ఎందరో విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన జార్జ్‌రెడ్డి చదువులోనూ టాపర్. మరి చాలా ఏళ్ల తర్వాత ఆయన బయోపిక్‌ను తెరకెక్కించడానికి గల కారణాలేంటో కానీ.. సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తి మాత్రం అందరిలోనూ నెలకొంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఆదివారం నిర్వహించడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ వేడుకకి పవర్‌స్టార్, జనసేనాని పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తాడని ఖరారైంది. అయితే ఇలాంటి సెన్సిటివ్ సినిమాకు పవన్‌లాంటి స్టార్ హీరో వచ్చి స్పీచ్ ఇస్తాడంటే యూత్‌లో, కాలేజీ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారనడంలో సందేహం లేదు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఇబ్బందిగా మారుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి `జార్జ్‌రెడ్డి` ప్రీ రిలీజ్‌కు పర్మిషన్‌ను క్యాన్సిల్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout