'జార్జ్‌రెడ్డి' కి తెలంగాణ ప్ర‌భుత్వం షాక్‌

  • IndiaGlitz, [Sunday,November 17 2019]

సందీప్ మాధ‌వ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'జార్జ్‌రెడ్డి'. జీవ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ న‌వంబ‌ర్ 22న విడుద‌ల కానుంది. 1965 కాలంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ కాలేజ్ విద్యార్థి నాయ‌కుడైన జార్జ్ రెడ్డిని అప్ప‌టి కాలేజ్ గొడ‌వ‌ల్లో కొంత మంది దుండ‌గులు హ‌త్య చేశారు. ఆయ‌న జీవితం ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. 'ద‌ళం' ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్ర‌మిది. అప్ప‌ట్లో ఉస్మానియా కాలేజ్‌లో జ‌రిగే అన్యాయాల‌ను ఎదిరించి ఎంద‌రో విద్యార్థుల‌కు ఆద‌ర్శ‌ప్రాయుడిగా నిలిచిన జార్జ్‌రెడ్డి చ‌దువులోనూ టాప‌ర్‌. మ‌రి చాలా ఏళ్ల త‌ర్వాత ఆయ‌న బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌డానికి గ‌ల కార‌ణాలేంటో కానీ.. సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి మాత్రం అంద‌రిలోనూ నెల‌కొంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను ఆదివారం నిర్వ‌హించ‌డానికి చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. ఈ వేడుకకి ప‌వ‌ర్‌స్టార్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా వ‌స్తాడ‌ని ఖ‌రారైంది. అయితే ఇలాంటి సెన్సిటివ్ సినిమాకు ప‌వ‌న్‌లాంటి స్టార్ హీరో వ‌చ్చి స్పీచ్ ఇస్తాడంటే యూత్‌లో, కాలేజీ విద్యార్థులు ఎక్కువ సంఖ్య‌లో హాజ‌ర‌వుతార‌న‌డంలో సందేహం లేదు. లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య వ‌స్తే ఇబ్బందిగా మారుతుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆలోచించి 'జార్జ్‌రెడ్డి' ప్రీ రిలీజ్‌కు ప‌ర్మిష‌న్‌ను క్యాన్సిల్ చేసింది.

More News

జబ‌ర్‌ద‌స్త్ నుండి నాగబాబు వైదొలగడానికి కారణం ఇదే?

టీవీ కామెడీ షోస్‌లో ఈటీవీ జ‌బ‌ద‌స్త్ ప్రోగ్రామ్ స‌క్సెస్ అయినంత మ‌రే ప్రోగ్రామ్ కూడా స‌క్సెస్ కాలేదు.

అనుకోకుండా జ‌రిగి పోయింద‌ని అంటున్న హీరోయిన్‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోద‌రి.. హీరోయిన్ ప‌రిణీతి చోప్రా ప్ర‌స్తుతం ఓ బ‌యోపిక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘పవన్‌.. నీ అసలు పేరేంటి.. ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేవ్!?’

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్ని జన్మలెత్తినా సీఎం కాలేడని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

జగన్ చిటికేస్తే.. టీడీపీ అడ్రస్ గల్లంతే.. బాబుకు దమ్ముంటే..!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్క చిటికేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

ఆర్జీవీని ఏమీ చేయలేక నన్ను అంటారేంటి..!?: వంశీ

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.