హైద్రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఒక ముందడుగు వేసి.. దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆక్సిజన్ తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం విమాన సేవలను వినియోగించుకుంటోంది. ఇలా విమానాల ద్వారా ఆక్సిజన్‌ను తరలిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ఇప్పటికే హైదాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో విమానాలు బయల్దేరాయి. ఈ క్రమంలోనే మూడు రోజుల సమయం ఆదా అవడంతో పాటు ఆక్సిజన్ అత్యవసరమైన రోగులకు ప్రాణవాయువు తక్షణమే అందనుంది. ఈ తరలింపు కార్యక్రమాన్నంతా మంత్రి ఈటల రాజేందర్ పర్యవేక్షిస్తున్నారు.
దీనిపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంతరి ఈటలకు ధన్యవాదాలు తెలిపారు. తేడాది మే- జూన్‌లో రికార్డు స్థాయిలో వాడకం జరిగింది. దాదాపు 175 మెట్రిక్ టన్నుల వాడకం జరిగింది.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రతతో రోజుకు 340 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 268 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి లభిస్తోంది. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని సూచించింది. తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్‌ప్లాంట్ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం. అయితే తెలంగాణకు బల్లారి, ఒడిశా నుండి ఆక్సీజన్ దిగుమతికి కేంద్రం అనుమతించనుంది. చాలా దూరం నుంచి ఆక్సిజన్ దిగుమతికి రోజుల తరబడి సమయం పడుతోంది. రీఫిల్లింగ్ కోసం ఖాళీ సిలిండెర్లను యుద్ధ విమానాల్లో పంపి.. రీఫిల్లింగ్ సిలిండర్లను రోడ్డు మార్గంలో ప్రభుత్వం తీసుకు వస్తోంది.
ఈ క్రమంలోనే వైజాగ్ నుంచి కూడా దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవడం అంత తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాల నుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం మూడు రోజులు.. లేదంటే అంతకన్నా ఎక్కువ రోజులే పట్టే అవకాశం ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ఈ ఉదయం బయల్దేరి వెళ్లాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout