థియేటర్స్ యాజమాన్యాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Send us your feedback to audioarticles@vaarta.com
థియేటర్స్ యాజమాన్యాలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం సినిమా థియేటర్లకు ఫుల్ పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో నేడు తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది. దీంతో దాదాపు పది నెలల తర్వాత థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించనున్నాయి. కరోనా కారణంగా కేంద్రం గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడ్డాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఆంక్షలు సడలిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల థియేటర్స్‌కు 50 శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చింది. దీంతో పలు చిత్రాలు థియేటర్‌లో విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ గవర్నమెంట్ 100 శాతం ప్రేక్షకులను అనుమతులిస్తూ జీవో జారీ చేసింది.
ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన క్రాక్, అల్లుడు అదుర్స్ , రెడ్ వంటి సినిమాలు 50 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్లలో సందడి చేశాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మరిన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలన్నీ విడుదల తేదీలను ప్రకటించేశాయి. ఇక నుంచి సినీ ప్రియులకు ఎప్పటిలాగే వీకెండ్ హంగామా మొదలు కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments