థియేటర్స్‌ యాజమాన్యాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

  • IndiaGlitz, [Saturday,February 06 2021]

థియేటర్స్‌ యాజమాన్యాలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం సినిమా థియేటర్లకు ఫుల్ పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో నేడు తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది. దీంతో దాదాపు పది నెలల తర్వాత థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించనున్నాయి. కరోనా కారణంగా కేంద్రం గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడ్డాయి.

అయితే కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఆంక్షలు సడలిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల థియేటర్స్‌కు 50 శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చింది. దీంతో పలు చిత్రాలు థియేటర్‌లో విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ గవర్నమెంట్ 100 శాతం ప్రేక్షకులను అనుమతులిస్తూ జీవో జారీ చేసింది.

ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన క్రాక్, అల్లుడు అదుర్స్ , రెడ్ వంటి సినిమాలు 50 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్లలో సందడి చేశాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మరిన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలన్నీ విడుదల తేదీలను ప్రకటించేశాయి. ఇక నుంచి సినీ ప్రియులకు ఎప్పటిలాగే వీకెండ్ హంగామా మొదలు కానుంది.

More News

రాజ‘శేఖర్’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో రాజశేఖర్ 2017లో ఎంట్రీ ఇచ్చి ‘గరుడవేగ, కల్కి’ వంటి సినిమాలతో మరోమారు తన స్టామినాను రుజువు చేసిన విషయం తెలిసిందే.

స్టార్ మా లో ఈ ఆదివారం.. విందు భోజనం

స్టార్ మా లో ఈ ఆదివారం.. అంటే ఫిబ్రవరి 7న .. మరింత స్పెషల్ గా ఉండబోతోంది . అభిమాన సెలెబ్రిటీలు అందరూ ప్రేక్షకులను అలరించేందుకు

ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌.... ప్రాక్టీస్‌లో రామ్ & భీమ్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ షూటింగ్‌ కొన్ని రోజుల క్రితం స్టార్ట్‌ అయింది.

ప్రయివేటుగా భర్తకు ముందే చూపించిన కాజల్‌!

నారీ నారీ నడుమ మురారి... హిట్లు సినిమా! ఇరువురి భామల మధ్య మగమహారాజు చిక్కుకున్న సందర్భాన్ని వర్ణించడానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనేది వాడతారు.

గుర్రమెక్కిన దిల్‌ రాజు మనవరాలు!

రాజుగారి మనవరాలు గుర్రం ఎక్కింది. గుర్రం అంటే మందు అనుకునేరు... నిజమైన గుర్రం. చిన్నారి ఇషిక గుర్రపు స్వారి చేసింది.