వరుణ్ తేజ్ ‘గని’ సినిమాకు కేసీఆర్ సర్కార్ షాక్.. టికెట్ రేట్స్ తగ్గింపు, మూవీ లవర్స్‌కి బిగ్ రిలీఫ్

  • IndiaGlitz, [Monday,April 04 2022]

కోవిడ్ సమయంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది చిత్ర పరిశ్రమ. లాక్‌డౌన్, ఇతర ఆంక్షల కారణంగా ఎక్కడికక్కడ షూటింగ్‌లన్నీ బంద్ అయ్యాయి. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనాకు బలయ్యారు. మధ్యలో నిబంధనలు ఎత్తివేసినప్పటికీ థియేటర్లలో ఆక్యూపెన్సీ విషయంలో మాత్రం ప్రభుత్వాలు ససేమిరా అన్నాయి. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం- టాలీవుడ్ మధ్య పెద్ద వివాదమే నడిచింది. టికెట్ల రేట్లు తగ్గించాలని, బెనిఫిట్ షోలు రద్దు చేయాలని ఏపీలోని జగన్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నించింది. టికెట్ రేట్లు చాలా తక్కువగా వుండటంతో మధ్యలో విడుదలైన కొన్ని పెద్ద సినిమాలు నష్టపోవాల్సి వచ్చింది. అయితే చిరంజీవి తదితర పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించారు. తర్వాత చిత్ర పరిశ్రమను సంతృప్తి పరిచేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అయితే తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ మాత్రం టాలీవుడ్‌ని కరుణిస్తూ వచ్చింది. టికెట్ల రేట్లు పెంచడంతో పాటు అదనపు షోలకు అడిగిన వెంటనే కాదనకుండా ఓకే చెప్పింది. అలాంటి తెలంగాణ ప్రభుత్వం వరుణ్ తేజ్ నటించిన గనికి మాత్రం షాకిచ్చింది. మూవీకి టికెట్ల రేటు పెంచడం లేదని పాత రేట్స్‌ ప్రకారమే మూవీ టికెట్ల రేట్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. సర్కార్ నిర్ణయంతో మల్టీప్లెక్స్‌లో రూ. 250 నుంచి రూ. 200 ప్లస్‌ జీఎస్టీ, సింగిల్ స్క్రిన్‌ థియేటర్లలో గరిష్టంగా 150 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. టికెట్ రేట్స్ తగ్గించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘గని’ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్దు ముద్దు నిర్మించారు. వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషించారు.

More News

విజయ దేవరకొండ విడుదల చేసిన 'పంచతంత్రం' లోని 'అరెరే..అరెరే.. మాటే..రాదే...' లిరికల్ వీడియో

టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకంపై కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌,

జనం కోరుకున్నదొకటి.. జగన్ సర్కార్ చేసింది మరొకటి : జిల్లాల ఏర్పాటుపై పవన్ ఆగ్రహం

పలుమార్లు వాయిదా పడుతూ.. అక్కడక్కడా నిరసనలు చికాకు పెట్టినా ఎట్టకేలకు ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.

ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం.. కలెక్టరేట్‌లు ఎక్కడంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ రోజు కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి.

ఏపీలో ఉనికిలోకి కొత్త జిల్లాలు, ఇకపై మొత్తం 26 - వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది.

‘‘ఆర్ఆర్ఆర్’’ లాగే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులు కొడుతుంది : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.