కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • IndiaGlitz, [Saturday,July 18 2020]

కరోనా వైరస్.. తెలంగాణ నెత్తిపై పెద్ద పిడుగే వేసింది. మాటల్లో చెప్పలేనంత అప్రదిష్టను తెచ్చిపెట్టింది. కనీసం మంత్రులు సైతం మైక్ ముందుకొచ్చి సమర్థించుకునే పని లేకుండా చేసేసింది. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలు భయపడేలా చేసింది. అలాగని ప్రైవేటు ఆసుపత్రికెళితే ఆస్తులమ్మినా కట్టలేని బిల్లులు.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రజానీకం ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మధ్యలో కొద్దిరోజుల పాటు సాక్షాత్తు సీఎం కేసీఆర్ మాయం. విమర్శలు, ప్రతి విమర్శలు, సెటైర్లు, మీమ్స్.. చివరికి సడెన్‌గా ప్రగతి భవన్‌కి వచ్చి కేసీఆర్ షాకిచ్చారు.

అన్నీ ఓకే గానీ కరోనా తెచ్చిన అప్రదిష్టను రూపుమాపడం ఎలా? ఏం చేస్తే పోతుంది? ఇది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. గోటి చుట్టుకి రోకలి పోటు అన్నట్టు.. ఉస్మానియాను వర్షం నీళ్లు ముంచెత్తాయి. ఇంకేముంది ప్రతిపక్షాలకు చేతినిండా అస్త్రాలే.. దీంతో విమర్శలకు మరింత పదును పెట్టాయి. ఈ తరుణంలో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం మొదలు పెట్టింది. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ముఖ్య అధికారులను బదిలీ చేసింది. అంతేకాకుండా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

తాజాగా మంత్రులతో ఓ కమిటి వేసి కరోనా నివారణ బాధ్యత మొత్తం ఆ కమిటీకి అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడో.. రేపో ప్రభుత్వం మంత్రుల కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మంత్రుల కమిటీకి చైర్మన్‌గా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉండనున్నారు. కమిటీ సభ్యులుగా కేటీఆర్, దయాకర్‌రావు సహా నలుగురు మంత్రులుంటే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి రెండు రోజుల్లో కరోనా కట్టడికి తీసుకోవాలసిన చర్యలపై నివేదక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

More News

ఏపీలో షాక్.. ఒక్కరోజే దాదాపు 4 వేల కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు షాక్ ఇచ్చాయి. 2500 కేసులు నమోదవుతుంటేనే జనం భయపడిపోతుంటే..

అది నాకే తెలుసు.. అందుకే నా బయోపిక్‌లో నేనే హీరో: సోనూసూద్

ఎవరి బయోపిక్‌లో వారే నటిస్తే.. ఆలోచనే వినూత్నంగా ఉంది కదా..

ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనున్న నితిన్, షాలిని జంట.. డేట్ ఫిక్స్

యంగ్ హీరో నితిన్‌ పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెలలోనే నితిని, షాలినిల జంట పెళ్లి పీటలెక్కనుంది.

ప్ర‌భాస్ 21కి మ్యూజిక్ డైరెక్ట‌ర్ దొరికేశాడు!!

‘బాహుబ‌లి’ రెండు పార్టులు విడుద‌లైన త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ఈ హీరో నేష‌న‌ల్ రేంజ్‌లో మార్కెట్‌ను పెంచుకున్నాడు.

మెగా ‘లూసిఫ‌ర్’ ఆగిందా?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’‌ను రీమేక్ చేయ‌డానికి ఎప్ప‌టి నుండో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.