వ్యాక్సిన్‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగానే ఉంది. అయితే వ్యాక్సిన్ కొరత కూడా రాష్ట్రాన్ని వేధిస్తోంది. 18-45 ఏళ్ల మధ్య వయసువారికి వ్యాక్సిన్ అందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణలో కొవిడ్ టీకాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. షార్ట్ టెండర్ నోటుఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. టెండర్ ప్రక్రియలో భాగా ఈ నెల 26న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి : కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత టీకా కోసం 9 నెలలు ఆగాలట..

ఐసీఎంఆర్ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం మేరకు గ్లోబల్ టెండర్లను పిలిచారు. రాష్ట్ర వైద్య సదుపాయాల మౌలిక వసతుల సంస్థ ద్వారా 10 మిలియన్ డోసుల వాక్సిన్‌ను ప్రభుత్వం సేకరించనుంది. బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా నిర్ణయించింది. 6 నెలల్లో 10 మిలియన్ డోసుల వాక్సిన్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వం కండిషన్ విధించింది. సప్లయర్ నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా సప్లై చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల మందికి వాక్సిన్ వేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. తక్కువ కోట్ చేసిన సంస్థకు ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా బాధ్యతలను అప్పగించనుంది.