Secretariat:తెలంగాణ కొత్త సచివాలయానికి ముహూర్తం ఫిక్స్.. అంబేద్కర్ విగ్రహానికి కూడా, ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని .. హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మిస్తోన్న భారీ అంబేద్కర్ విగ్రహాన్ని, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం నిర్మాణ పనులను, అక్కడి రోడ్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వున్నారు.
6 వందల కోట్లకు పైగా వ్యయంతో కొత్త సచివాలయం:
కాగా... హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం .. ఆధునిక హంగులతో కొత్త సచివాలయ నిర్మాణానికి నడుం బిగించింది. దాదాపు 6 వందల కోట్లకు పైగా వ్యయంతో, 6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, అధికారుల కోసం అధునాతన హాల్స్‌ను నిర్మిస్తున్నారు. అలాగే మంత్రుల షేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్‌లు ఏర్పాటు చేయనున్నారు.
దక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో సచివాలయ నిర్మాణం:
కొత్త సచివాలయ నిర్మాణానికి డిజైన్లను వాస్తు ప్రకారం రూపొందించారు. దక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో ఈ డిజైన్లు వున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాలు వుండనున్నాయి. సచివాలయంలోకి గాలి , వెలుతురు ధారాళంగా వచ్చేలా ప్లాన్ చేశారు. భవనం మధ్యలో భారీ ఎల్ఈడీ వాల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తెలంగాణ అభివృద్ధిని , 33 జిల్లాల కళ, సంస్కృతిని ప్రదర్శిస్తారు. ఒకేసారి 650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యాలతో పాటు సిబ్బంది, సందర్శకుల కోసం బ్యాంక్, ఏటీఎం, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఫైర్ స్టేషన్, విజిటర్స్ రూమ్స్ వుంటాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments