కోడెల మృతిపై తెలంగాణ సర్కార్ విచారణ!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనేక అనుమానాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే.. కోడెల చిరకాల శత్రువు అయిన అంటి రాంబాబు సమాచారం. కోడెలది అనుమానాస్పద మృతిలా కనిపిస్తోందన్నారు. ‘కోడెల మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. కోడెల మృతిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘ఆత్మహత్య’ అని కొందరు, ‘గుండెపోటు’ అని మరికొందరు అంటున్నారు. కోడెలది వివాదాస్పద మరణంలా కనిపిస్తోంది. దీనిపై తక్షణమే తెలంగాణ సర్కార్ సమగ్ర విచారణ జరిపించాలి.
శ్రీకాంత్ రెడ్డి వర్షన్ ఇదీ...
కోడెల శివప్రసాద్ అకాల మరణం దురదృష్టకరమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ‘కోడెల కుటుంబంతో పాటు, గోదావరిలో లాంచీ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదు. సీనియర్ నేత చనిపోయాడనే బాధ లేకుండా టీడీపీ నేతలు.. వైసీపీపై బురద జల్లుతున్నారరు. టీడీపీ నేతల విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవాలు అందరికీ తెలుస్తాయి’ అని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
సమగ్ర విచారణ జరగాలి!
కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ‘సాక్ష్యాలు తారుమారుకాకుండా చూడాలి. ముందు గుంటెపోటన్నారు.. ఆ తర్వాత ఆత్మహత్య అంటున్నారు. నిమ్స్ కో.. కేర్‌రె తీసుకెళ్లకుండా క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోడెలపై బాధితులు పెట్టిన కేసులే తప్ప.. ప్రభుత్వం నేరుగా కేసులు పెట్టలేదు. కోడెల మరణం తర్వాత పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పూర్తిస్థాయి విచారణ ద్వారానే వాస్తవాలు తెలుస్తాయి’ అని బొత్సా చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. కోడెల మరణంపై వైసీపీ నేతలు మాత్రం గట్టిగానే రియాక్ట్ అవుతునున్నారు. మరోవైపు.. టీడీపీ నేతలు మాత్రం.. ఇది సర్కార్ హత్యేనని.. ప్రభుత్వం వేధించడం వల్లే ఆయన చనిపోయారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై కోడెల కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో..? ఈ వ్యవహారం ఎంతవరకూ వేచిచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout