క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Send us your feedback to audioarticles@vaarta.com
క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేసే క్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు పేల్చవద్దని.. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ జీవో-1777 జారీ చేసింది. కాగా దీపావళి పండుగపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలివ్వాలంటూ ఇంద్ర ప్రకాష్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఆ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.
క్రాకర్స్ కారణంగా ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడతారని పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇప్పటివ వరకూ తెరిచిన షాపులన్నింటినీ మూసి వేయాలని తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్, కోల్‌కత్తాలో కూడా క్రాకర్స్‌ను బ్యాన్ చేయాలని ఆయా కోర్టులు ఆదేశాలు జారీ చేశాయని.. తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఆ విధంగానే తెలంగాణలో కూడా క్రాకర్స్‌ను బ్యాన్ చేయాలని హైకోర్టు తెలిపింది. ఎవరూ క్రాకర్స్ అమ్మడం గాని, కొనడం గాని చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవరైనా కోర్టు ఆదేశాలను మీరి అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది.
ఈ నెల 19న దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ప్రసార మాద్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు అదేశాలు జారీ చేసింది. కాగా.. క్రాకర్స్‌ను బ్యాన్ చేయడంపై షాపుల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల ముందు ఇలా చేస్తే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. తమ షాపులను మూసివేయిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com