Benefit Show: ‘‘మైత్రి’’కి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy), మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య (Waltair Veerayya) సినిమాల ప్రదర్శనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రెండు సినిమాల స్పెషల్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో జనవరి 12న ఉదయం 4 గంటలకు వీరసింహారెడ్డి, జనవరి 13న ఉదయం 4 గంటలకు వాల్తేర్ వీరయ్యల బెనిఫిట్ షోలు ప్రదర్శితం కానున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు తొలి రోజున ఆరు షోలు వేయడానికి వెసులుబాటు కలగనుంది. అయితే రెండో రోజు నుంచి మాత్రం రోజుకి ఐదు షోలు వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలో ఓకే మరి ఏపీలో :
ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా స్పెషల్ షోల కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంప్రదించే అవకాశాలు వున్నాయని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన నేపథ్యంలో స్పెషల్ షోలకి జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం అనుమానమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే.. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చుగా అనే అభిప్రాయంతో మరికొందరు వున్నారు.
వీరసింహారెడ్డి (Veera Simha Reddy)విషయానికి వస్తే.. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా.. వాల్తేర్ వీరయ్య (Waltair Veerayya)సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ రోల్ పోషించారు. శృతీ హాసన్ ,కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, బాబీ సింహా, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com