సీఎం కేసీఆర్‌కు మంత్రి ఈటల శాఖ బదిలీ

రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈటలకు ఏ శాఖా లేదు. ఇదిలా ఉండగా మంత్రి ఈటల పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు దాదాపుగా నిజమేనని విజిలెన్స్‌, రెవెన్యూఅధికారులు తేల్చారు. కాసేపట్లో సీఎస్‌, ఏసీబీ డీజీ సంబంధిత నివేదికను సీఎం కేసీఆర్‌కు అందేయనున్నారు. ఈ పరిణామంతో ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయమని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా.. మినీ మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ గడువు ముగిసిన కొద్ది సేపటికే వ్యూహాత్మకంగా తొలుత అధికార పార్టీ సొంత టీవీ చానల్‌ టీ న్యూస్‌ సహా ప్రభుత్వానికి అనుకూలం అనే పేరున్న మూడు టీవీ చానల్స్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జాకు పాల్పడినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈటలపై ఆరోపణలతో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఒక లేఖ బయటికి వచ్చింది. ఈ వ్యవహారంపై సీఎం విచారణకు ఆదేశించినట్లు ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఇవన్నీ ఒకే రోజు క్షణాల వ్యవధిలో చకచకా జరిగిపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

అయితే ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు యాధృచ్చికంగా కాకుండా, పక్కా వ్యూహం ప్రకారం బయటికి వచ్చాయనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. మినీ మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ గడువు ముగిసిన కొద్ది సేపటికే టీఆర్‌ఎస్‌, ప్రభుత్వ అనుకూల టీవీ చానళ్లలో ఈటలపై భూ కబ్జా ఆరోపణల కథనాలు ప్రసారం కావటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే రెండేళ్ల వరకూ ఎటువంటి ఎన్నికలు లేకపోవటం, ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్న క్రమంలో ‘ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం’ పేరుతో ఈటలపై ఆరోపణల కథనాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే కేబినెట్‌లో చేర్పులు, మార్పులకు సంకేతమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుకున్నదంతా అయ్యింది.

More News

సూప‌ర్‌స్టార్ మ‌హేష్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో భారీ చిత్రం

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు` 16ఏళ్లుగా, `ఖ‌లేజా` 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి.

సిద్దార్థ్‌ను పట్టించుకోకండి.. టైమ్‌ పాస్ కోసం ఆరోపణలు చేస్తారు: బీజేపీ

కేంద్ర ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలు, విమర్శలను ఎవ్వరూ పట్టించుకోవద్దని బీజేపీ నేతలు తమ కార్యకర్తలకు వెల్లడించారు.

ఈటల భూ కబ్జా వాస్తవమే.. 3 గంటల్లో నివేదిక: కలెక్టర్ హరీష్

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తిన ఘటన శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

కరోనా రోగుల కోసం అంబులెన్స్ డ్రైవర్‌‌గా మారిన కన్నడ హీరో

ప్రముఖ నటుడు సోనూసూద్ బాటలోనే మరో హీరో కూడా కరోనా రోగులకు సేవలందిస్తున్నాడు.

ఒక్క సిగిరెట్ కారణంగా 18 మందికి కరోనా..

ఒక మహిళ అష్టాచెమ్మా ఆడి పదుల సంఖ్యలో కరోనా అంటించిన విషయం ఇప్పటికీ తెలంగాణ వాసులు మరువలేరు.