RTC:సస్పెన్స్‌కు చెక్ .. ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ , కేసీఆర్‌కు 10 సూచనలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లుపై సస్పెన్స్ వీడింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంగీకారం తెలిపారు. అంతకుముందు ఈ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తడంతో పాటు ప్రభుత్వం తనకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. ఆర్టీసీ యూనియన్లు గవర్నర్ తీరును తప్పుబడుతూ నిరసనకు సైతం దిగారు. అయితే తనకు బిల్లును అడ్డుకునే ఉద్దేశం లేదని, కార్మికుల సంక్షేమం దృష్ట్యా వివరణ కోరానని గవర్నర్ తెలిపారు. ఈ క్రమంలో రవాణా శాఖ అధికారులు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. ఆమె అడిగిన ప్రశ్నలకు రవాణా, ఆర్టీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ వివరణపై సంతృప్తి చెందిన తమిళిసై బిల్లుకు ఆమోదం తెలిపారు. అలాగే ప్రభుత్వానికి 10 సూచనలు కూడా చేశారు.
రెండు రోజుల పాటు గందరగోళం :
కాగా.. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జూలై 31న జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇద మనీ బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి కోసం డ్రాఫ్ట్ బిల్లును రాజ్‌భవన్‌కు పంపారు. దీనిని వెంటనే ఆమోదించని తమిళిసై బిల్లుపై కొన్ని సందేహాలు లేవనెత్తడంతో హైడ్రామా మొదలైంది. రెండు సార్లు ఆమె వివరణ కోరడం, మూడు రోజులే అసెంబ్లీ సమాశాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.
గవర్నర్ తీరుతో రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు :
దీంతో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంయూ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్మికులు విధులు బహిష్కరించారు. రెండు గంటల తర్వాత మళ్లీ డ్యూటీ ఎక్కడంతో ఆర్టీసీ సేవలు యథాతథంగా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో విద్యార్ధులు, ఉద్యోగులు, అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద నిరసన చేపట్టాలని టీఎంయూ నిర్ణయించింది. దీంతో కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. బస్సుల్లో చేరుకున్న కార్మికులు, ఉద్యోగులు.. నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments