Tamilisai Soundararajan : కాలు జారి కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై .. వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం తమిళనాడులోని పత్తిపురం గ్రామంలో మొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి తమిళిసై హాజరయ్యారు. ఈ క్రంలో తన కారు దిగి వెళ్తుండగా.. నడుస్తూ, నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది , అధికారులు ఆమెను పైకి లేపారు. అయితే తమిళిసైకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కిందపడిపోయినందున టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుందని సెటైర్లు వేశారు. కార్యక్రమం ముగిశాక తమిళిసై తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం గవర్నర్ కిందపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుల్లి శాటిలైట్స్ తయారు చేసిన స్కూల్ పిల్లలు:
కాగా.. దేశంలోని మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ లాంచ్‌లో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 3,500 మంది విద్యార్ధులు తయారు చేసిన 150 చిన్న సైజు ఉపగ్రహాలను ప్రదర్శించారు. ఈ బుల్లి శాటిలైట్స్.. వాతావరణంలో మార్పులు, రేడియేషన్ సమాచారాన్ని సేకరిస్తాయి. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్ధుల్ కలాం పేరుతో.. ఏపీజే అబ్ధుల్ కలాం స్టూడెంట్స్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మిషన్ 2023 పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై విద్యార్ధులను ప్రశంసించారు. పిల్లలు చిన్నతనం నుంచే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలుగా రాణించేలా స్పూర్తి నింపాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు.
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి మహిళా కమీషన్ నోటీసులు :
ఇదిలావుండగా.. గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటాగా తీసుకున్న కమీషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఈ నెల 21న ఢిల్లీలోని తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
Telangana governor Tamilisai Soundararajan falls down on green carpet while she was walking towards venue for hybrid rocket launch at Changalpattu in Tamilnadu #Telangana pic.twitter.com/Xo8NgO66NQ
— Sudhakar Udumula (@sudhakarudumula) February 20, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com