సాయిపల్లవిపై బాడీ షేమింగ్ కామెంట్స్: మహిళల ఎదుగుదలను ఓర్వలేరు.. గవర్నర్ తమిళిసై ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘శ్యామ్ సింగరాయ్’’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించారు. దేవదాసీ సాంప్రదాయం ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా అక్కడా రికార్డులు తిరగరాస్తోంది. హీరో నానితో సమానంగా.. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి తన నటన, డ్యాన్సులతో మరోసారి జనాన్ని ఫిదా చేశారు. అయితే దేవదాసి పాత్రలో సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన వార్తపై దుమారం రేపుతోంది. దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఓ ప్రతిభావంతురాలైన నటిపై బాడీ షేమింగ్ చేయడం మంచి పద్ధతి కాదంటూ హితవు పలుకుతున్నారు.
తాజాగా ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. నటి సాయిపల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలకు పాల్పడటం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఓ తమిళ ఛానల్‌లో ఆమె మాట్లాడుతూ... తాను కూడా నా రూపం పట్ల చాలాసార్లు ట్రోలింగ్‌కు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నానని తమిళిసై అన్నారు. ఈ సమాజంలో ఎక్కువగా స్త్రీలే బాడీ షేమింగ్‌కు గురవుతుంటారని.. పురుషులను మాత్రం 50 ఏళ్ల వయసులో ఉన్నా యువకుల్లాగే చూస్తుంటారని గవర్నర్ వ్యాఖ్యానించారు. మహిళల ఎదుగుదలను చూసి ఓర్వలేని ఈ సమాజం వారిని బాధపెడుతూ.. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని తమిళిసై అన్నారు. స్త్రీలు ఈ తరహా వ్యాఖ్యలను పట్టించుకోవడం మానేసి మానసికంగా దృఢంగా మారాలని గవర్నర్ సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments