సాయిపల్లవిపై బాడీ షేమింగ్‌‌ కామెంట్స్: మహిళల ఎదుగుదలను ఓర్వలేరు.. గవర్నర్ తమిళిసై ఆగ్రహం

  • IndiaGlitz, [Sunday,January 30 2022]

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘శ్యామ్ సింగరాయ్’’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించారు. దేవదాసీ సాంప్రదాయం ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా అక్కడా రికార్డులు తిరగరాస్తోంది. హీరో నానితో సమానంగా.. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి తన నటన, డ్యాన్సులతో మరోసారి జనాన్ని ఫిదా చేశారు. అయితే దేవదాసి పాత్రలో సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన వార్తపై దుమారం రేపుతోంది. దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఓ ప్రతిభావంతురాలైన నటిపై బాడీ షేమింగ్‌‌ చేయడం మంచి పద్ధతి కాదంటూ హితవు పలుకుతున్నారు.

తాజాగా ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. నటి సాయిపల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలకు పాల్పడటం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఓ తమిళ ఛానల్‌‌లో ఆమె మాట్లాడుతూ... తాను కూడా నా రూపం పట్ల చాలాసార్లు ట్రోలింగ్‌కు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నానని తమిళిసై అన్నారు. ఈ సమాజంలో ఎక్కువగా స్త్రీలే బాడీ షేమింగ్‌కు గురవుతుంటారని.. పురుషులను మాత్రం 50 ఏళ్ల వయసులో ఉన్నా యువకుల్లాగే చూస్తుంటారని గవర్నర్ వ్యాఖ్యానించారు. మహిళల ఎదుగుదలను చూసి ఓర్వలేని ఈ సమాజం వారిని బాధపెడుతూ.. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని తమిళిసై అన్నారు. స్త్రీలు ఈ తరహా వ్యాఖ్యలను పట్టించుకోవడం మానేసి మానసికంగా దృఢంగా మారాలని గవర్నర్ సూచించారు.

More News

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

రాజమౌళి ప్రశంసలు అందుకున్న జీ 5 ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2'... నటుడు శశాంక్

ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ 'లూజర్' చూశారా? ఆ సిరీస్‌ను అంత త్వ‌ర‌గా వీక్షకులు మర్చిపోలేరు.

భారత్ పెగాసస్‌ను 2017లోనే కొనుగోలు చేసింది... న్యూయార్క్ టైమ్ సంచలన కథనం

గతేడాది భారత రాజకీయాల్లో ‘‘పెగాసస్’’ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షనేతలు, మీడియా సంస్థల అధినేతలు,

ప్రసవం , లాక్‌డౌన్.. ఒంటరితనమే కృంగదీసిందా: యడ్డీ మనవరాలి ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలు సౌందర్య మరణం ఆ రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది.

‘‘ అమ్మా నిన్ను కలవలేకపోతున్నా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు’’ , ఇట్లు నీ శంకర్ బాబు : చిరు ఎమోషనల్ ట్వీట్

కోవిడ్ మహమ్మారి చేస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆత్మీయులను కోల్పోవడంతో పాటు క్వారంటైన్‌లో వున్న వారి బాధ అంతా ఇంతా కాదు.