చిరంజీవి దంపతులని ప్రశంసించిన తెలంగాణ గవర్నర్

సేవకు నిలువెత్తు రూపం మెగాస్టార్ చిరంజీవి. తనని ఇంతటి వాడిని చేసిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తపిస్తుంటారు చిరంజీవి. అందుకోసమే దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లతో సేవలు చేస్తున్నారు. ఇక కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో అయితే చిరంజీవి తన వంతు బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

చిరంజీవి సేవా కార్యక్రమాలపై ఇప్పటికే నలువైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేరారు.

ఇదీ చదవండి: చిక్కుల్లో హైపర్ ఆది.. ద్వంద్వ అర్థాలతో డైలాగ్స్, రగిలిన వివాదం!

నేడు వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు రక్తదానం చేశారు. ఈ ఫోటోని చిరంజీవి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 'ప్రాణాలు నిలబెట్టేందుకు సాయం చేసే నా బ్లడ్ బ్రదర్స్, సిస్టర్స్ కి బ్లడ్ డోనార్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. రక్తదానం అనేది చాలా సులువుగా ప్రాణాలు నిలబెట్టే గొప్ప అవకాశం' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

దీనిపై తెలంగాణ గవర్నర్ తమిళసై స్పందించారు. చిరు దంపతులని ప్రశంసించారు. అత్యుత్తమ సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి గారు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. రక్తదానం, ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం లాంటివి ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రశంసనీయమైనవి అని తమిళసై చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు.