తెలంగాణలో మందుబాబులకు గుడ్‌న్యూస్: 31 రాత్రి 12 వరకు మద్యం షాపులు ఓపెన్‌లోనే
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో ఓ వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం.. అనేక రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్న వేళ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగించింది. డిసెంబరు 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పంది. అలాగే డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు సైతం ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు మంజూరు చేస్తుంది. అయితే, ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి లైసెన్స్‌ఫీజు రూ.50 వేల నుంచి 2.5 లక్షలుగా ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సమయం వరకే కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని తెలంగాణ సర్కార్ సూచించింది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతన్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే రెండు రోజుల క్రితం ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో న్యూఇయర్ రోజు భారీగా వేడుకలు ప్లాన్ చేసుకున్న వారు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో వైన్ షాపులు, బార్లు, పబ్‌ల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కాగా.. తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మంగళవారం 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments