close
Choose your channels

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘‘భీమ్లా నాయక్’’ ఐదో షోకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Wednesday, February 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 25న పవన్ నటించిన భీమ్లానాయక్‌ విడుదల కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా ఐదో ఆట ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోనూ ‘‘భీమ్లా నాయక్’’ ఐదో ఆటను ప్రదర్శించుకోవచ్చు. తెలంగాణ సర్కార్ నిర్ణయం పట్ల పవన్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భీమ్లా నాయక్‌’’ను తొలుత సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే దీనికి ముందు వెనుకా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానుండటంతో చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25కి భీమ్లా నాయక్ వాయిదా పడింది.

ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తుండగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment