తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తక్షణమే ప్రభుత్వం జీవోను సైతం జారీ చేసింది. తెలంగాణలో కర్ఫ్యూ నేటి రాత్రి నుంచే ప్రారంభం కానుంది.రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఏప్రిల్ 30 వరకూ ఈ రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది.
కాగా.. రాత్రి 8 గంటల వరకే రెస్టారెంట్లు, బార్లు, పబ్లు, క్లబ్లు, షాపులకు అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత ఎక్కడైనా షాపు ఓపెన్ చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, డయోగ్నస్టిక్, మెడికల్ షాపులు వంటి అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది. కాగా.. తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని.. వారాంతపు లాక్డౌన్పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనాను నియంత్రించేందుకు చర్యలేమీ తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సినిమా హాల్లు, పబ్బులు బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కనీస వివరాలు లేకపోవడంతో హైకోర్టు అక్షింతలు వేసింది. పబ్బులు, మద్యం దుకాణాలపై చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించింది. మీకు ఆదాయమే ముఖ్యమా అంటూ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా టెస్టులపై సైతం ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వం 48 గంటల్లో నిర్ణయాలు తీసుకోకుంటే తామే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com