లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు.. ఇతర కీలక నిర్ణయాలివే..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో అనివార్య పరిస్థితుల్లో మరోసారి తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌కు మొగ్గు చూపింది. కొన్ని రోజుల క్రితం కర్ఫ్యూ విధించినప్పటికీ దాంతో ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో తిరిగి లాక్‌డౌన్ విధించింది. ఇది నేటి(బుధవారం) ఉదయం 10 గంటల నుంచే అమల్లోకి ఈ నెల 21 వరకూ మొత్తం 10 రోజులపాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. లాక్‌డౌన్ విధింపు, రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై చర్చించడానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధింపుతో పాటు పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. కాగా.. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర కేబినెట్ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ను కొనసాగించాలా ముగించాలా అన్న అంశంపై ఆ భేటీలో చర్చించి, తదుపరి నిర్ణయాన్ని ప్రకటించనుంది.
లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు..
వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఎరువులు, విత్తనాల దుకాణాలు, విత్తన తయారీ కర్మాగారాలు.. తదితర అన్ని రకాల వ్యవసాయ సంబంధిత రంగాలు
ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగుతుంది
వైద్య రంగంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్ని రకాల వైద్య సేవలకు అనుమతి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యథావిధిగా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ.
విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలకు మినహాయింపు
జాతీయ రహదారుల మీద రవాణా యథావిధిగా కొనసాగుతుంది.
జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచి ఉంటాయి.
కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
ప్రింట్, ఎలక్ర్టానిక్‌మీడియాకు మినహాయింపు
ఉపాధి హామ పనులు యథావిధిగా కొనసాగుతాయి.
ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పని చేస్తాయి
గత లాక్‌డౌన్‌లో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పని చేస్తాయి
అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్ఠంగా 40 మందికి, అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి
తెలంగాణ చుట్టూ... రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని రకాల మెట్రో, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
రేషన్ దుకాణాలు కూడా ఆ సమయంలోనే తెరిచి ఉంటాయి.
కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.
సినిమా హాళ్లు, క్లబ్బులు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, అమ్యూజ్‌మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలను మూసి వేయాలని నిర్ణయం.
కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు
వైరస్‌పై పోరులో అత్యంత కీలకమైన వ్యాక్సిన్లను యుద్ధప్రాతిపదికన సేకరించాలని, అందుకోసం కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలి
ప్రభుత్వ రంగంతో పాటు, ప్రైవేట్ రంగంలోనూ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ఆదేశాలు
అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన... కలెక్టర్, డీఎంహెచ్‌వో, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. రోజూ మంత్రులు వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలి
ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్ ఆమోదం. సభ్యులుగా పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి, కొవిడ్-19 ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి ఉంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments