రేపటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. 12 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు అంటే ఈ నెల 22 వరకూ లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో అవకాశం కల్పించారు. 10 తరువాత అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
Also Read: డబుల్ మాస్క్ వాడుతున్నవారు.. ఈ విషయం తెలుసుకోవల్సిందే..
ప్రతి రోజూ 20 గంటలపాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. పది తర్వాత మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు జన సంచారంపై కఠిన నియంత్రణలు ఉంటాయి. మరోవైపు టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీలో లాక్‌డౌన్ కారణంగా ఎదుర్కోవల్సిన అంశాలపై చర్చించింది. హైకోర్టులో కరోనా అంశంపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉదయం విచారణ జరిగిన అనంతరం హైకోర్టు కేసును మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నప్పటికీ కఠిన చర్యలు అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. లాక్‌డౌన్ విధిస్తారా? లేదంటే నిబంధనలు కఠినతరం చేస్తారా? అని ప్రశ్నించింది. ఇప్పటికే సీఎస్ మీడియా సమావేశంలో లాక్‌డౌన్ అవసరం లేదంటూ చెప్పిన విషయమై కూడా హైకోర్టు స్పందించింది. తాము లాక్‌డౌన్ గురించి పరిశీలించండి అన్నప్పుడు అలాంటిది అవరసం లేదు అని సీఎస్ ఎలా చెబుతారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. రంజాన్ పండుగ అయ్యాక ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టాలనుకుంటుందా? అని హైకోర్టు నిలదీసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం రేపటి నుంచి లాక్‌డౌన్‌ను విధించడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments