ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్పై (వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు) ప్రజానీకం నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విషయంలో స్పష్టతనిచ్చింది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నేడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చించిర మీదట ఎల్ఆర్ఎస్కు సంబంధించిన కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని.. ఇప్పటి వరకూ ఉన్న ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కాగా.. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ అనుమతి పొందినవాటికి రిజిస్ట్రేషన్లను యథావిధిగా కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కొత్త వేసిన ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే వాటికి రిజిస్ట్రేషన్ ఉంటుందని కేసీఆర్ సర్కార్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాలతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగినట్లయ్యింది. కాగా.. ఎల్ఆర్ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆయా ప్లాట్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసిన రశీదు ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలు కల్పించి, క్రయవిక్రయాలు జరిగేలా చూడాలని నిర్ణయించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout