వాహనదారులకు గుడ్ న్యూస్.. చలాన్ల గడువు మరోసారి పెంపు..

  • IndiaGlitz, [Wednesday,January 31 2024]

రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. నేటితో ముగుస్తున్న గడువును ఫిబ్రవరి 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివిధ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు రాయితీ ఇస్తూ గతేడాది డిసెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 10వరకు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. అయితే గడువు ముగిసినా చాలా వరకు పెండింగ్ చలాన్లు అలాగే ఉండటంతో ఆ గడువును జనవరి 31వ తేదీ వరకు పెంచింది.

మరోసారి కూడా ఈ గడువు పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే జనవరి 31లోపు చెల్లించిన వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుందని పొడిగింపు ఉండదని అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ చివరికి ఫిబ్రవరి 15 వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా.. ఇప్పటివరకు కేవలం 1,52,47,864 మంది మాత్రమే చలాన్లు చెల్లించారు. ఈ చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.135 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే వసూలైనట్లు అధికారులు తెలిపారు.

పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులు ఇంకా చాలా మంది ఉన్నారని భావించిన సర్కార్.. ఈ గడువును పెంచేందుకే మొగ్గు చూపింది. దీని ద్వారా ఆదాయం సమకూర్చునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90 శాతం, ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, ఇతర వాహనాల చలాన్లపై 60 శాతం డిస్కౌంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది కూడా ఇలా రాయితీ ప్రకటించడంతో వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకు వసూలయ్యాయి.

More News

Gyanvapi: జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం.. మసీదులో పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి..

జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణలో సీల్ చేసి ఉన్న బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది.

మద్యం మత్తులో కండక్టర్‌పై యువతి దాడి.. ఆర్టీసీ యాజమాన్యం ఆగ్రహం..

హైదరాబాద్‌లో ఓ యువతి ఆర్టీసీ బస్సులో హల్‌చల్ చేసింది. హయత్‌నగర్ బస్ డిపో-1కు చెందిన బస్సు హయత్ నగర్ నుంచి అప్జల్ గంజ్ బయల్దేరింది. హయత్‌నగర్ బస్టాప్‌లో ఓ యువతి మద్యం మత్తులో బస్సు ఎక్కింది.

AP DSC: నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. మెగా డీఎస్సీకి ఆమోదం..

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గత ఐదేళ్లుగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

President Murmu: 500 ఏళ్ల నాటి అయోధ్య రామమందిరం కల నెరవేర్చాం: రాష్ట్రపతి

పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రసంగించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌లో ఇవే తొలి బడ్జెట్ సమావేశాలు కావడం విశేషం.

Kumari Aunty: కుమారీ ఆంటీకి అండగా నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్‌ సెంటర్‌ను