టాలీవుడ్‌కు కేసీఆర్ శుభవార్త.. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్‌సిగ్నల్

  • IndiaGlitz, [Friday,December 24 2021]

ఓ వైపు సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఏపీలో వివాదం కొనసాగుతున్న వేళ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూవీ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ సర్కారు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్లపై ధర, జీఎస్‌టీ, నిర్వహణ ఛార్జీలు, ఆన్‌లైన్‌ ఛార్జీలను వేర్వేరుగా ముద్రించాలని ప్రభుత్వం సూచించింది.

కొత్త సినిమా టికెట్ ధరలు ఇవే:

ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150 (జీఎస్టీ అదనం)

మల్టీప్లెక్స్‌ల్లో మినిమం టికెట్‌ ధర రూ.100+జీఎస్‌టీ, గరిష్ఠంగా రూ.250+జీఎస్‌టీ

సింగిల్‌ థియేటర్లలో స్పెషల్‌ రిక్లైనర్‌ సీట్లకు రూ.200+ జీఎస్‌టీ.. మల్టీప్లెక్స్‌లలో రూ.300+ జీఎస్‌టీ

నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్‌లలో రూ.5, నాన్‌ ఏసీకి రూ.3 వసూలు చేసుకోవచ్చు.

More News

జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్జీవి "ఆశా"..ఎన్ కౌంటర్'

శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా అకుల,  వెంకట్, శ్రీధర్, ముని,  నవీన్,  కళ్యాణ్,  ప్రవీణ్,  ప్రశాంతి నటీనటులుగా ఆనంద్ చంద్ర  రచన, దర్శకత్వంలో

శ్రీశైలం ఆలయం వద్ద డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు గుజరాతీయులు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ కలకలం రేపింది. ఆలయ పుష్కరిణీ వద్ద డ్రోన్‌ ప్రయోగానికి కొందరు యత్నించడంతో ఆలయ భద్రతా సిబ్బంది

ఏపీలోనూ విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. వెలుగులోకి మూడో కేసు, తూర్పుగోదావరిలో కలకలం

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో అంతకంతకూ విస్తోరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని కేసులు పెరుగుతున్నాయి.

పెరట్లో ఆనపకాయలు చూసి మురిసిపోతూ... రైతుకి సెల్యూట్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వుంటారు.

రాధేశ్యామ్ ట్రైలర్: యాక్షన్ పక్కనబెట్టి, రొమాన్స్‌లో మునిగిపోయిన ప్రభాస్

బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాపై టాలీవుడ్‌తో పాటు యావత్ దేశం ఎన్నో అంచనాలు పెట్టుకుంది.