సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఆరు రోజుల పాటు పండుగ సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 12 నుంచి 17వ తేది వరకు హాలీడేస్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవులు అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 13న రెండో శనివారం ఉండగా, 14వ తేదీన భోగి, 15వ తేదీన సంక్రాంతి, 16న కనుమ పండుగలు జరగనున్నాయి. 17న అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఈ నెల 18వ తేదిన తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది.
సెలవుల సందర్భంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే మిషనరీ పాఠశాలలకు మాత్రం ఈ హాలీడేస్ నుంచి మినహాయింపు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. పెద్ద పండుగగా దీనిని జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగకు ఎక్కడెక్కడో ఉండే వారంతా సొంత గ్రామాలకు చేరుకుంటారు. బంధుమిత్రులతో కలిసి సంబురాలు చేసుకుంటారు.
సంవత్సరం మొత్తం ఈ పండుగ జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. అందుకే ఈ పండుగకు కచ్చితంగా అందరూ సొంతూళ్లకు వెళ్తారు. అలాగే విద్యార్థులు కూడా ఈ సెలవుల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అమ్మమ్మ, నాన్నమ్మ ఊళ్లకు వెళ్లి ఆనందంగా గడపడానికి సిద్ధమవుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం సంక్రాంతికి 6 రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments