రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్... దళితబంధుకు ప్రాధాన్యత, ఏ రంగానికి ఎంతంటే..?

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు కాగా, కేపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు. రాష్ట్రంలో పన్ను ఆదాయం 1,08,211.93 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా 18,394.11 కోట్లు. పన్నేతర ఆదాయం 25,421.63 కోట్లు కాగా.. గ్రాంట్లు 41,001.73 కోట్లు, రుణాలు 53,970 కోట్లని హరీశ్ రావు తెలిపారు. ఇక ఏయే రంగాలకు ఎంతెంత కేటాయింపులు చేశారో చూస్తే:

దళిత బంధుకు రూ.17,700 కోట్లు

పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు

పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు

నూతనంగా నిర్మించబోయే మెడికల్ కళాశాలలకు రూ.1000 కోట్లు..

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు

బ్రాహ్మణ సంక్షేమానికి రూ.177 కోట్లు.

రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్‌ నిర్వహణ గ్రాంట్‌ రూ.1,542 కోట్లు.

పోలీసు శాఖకు రూ.9,315 కోట్లు..

ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు

మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రి జిల్లాల్లో వైద్య కళాశాలలు

రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ

పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ..

రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం నిమిత్తం రూ.వెయ్యి కోట్లు.

రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం.

సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణం నిమిత్తం రాష్ట్రంలోని 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం.

యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి..

గిరిజన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ.600 కోట్లు.

ఎస్టీ సంక్షేమానికి రూ.12,565 కోట్లు.

బీసీ సంక్షేమానికి రూ.5,698 కోట్లు.

అమ్మకం పన్ను అంచనా 33,000 కోట్లు.

ఎక్సైజ్ ద్వారా ఆదాయం 17,500 కోట్లు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం 15,600 కోట్లు.

వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు

హరితహారానికి రూ.932 కోట్లు

ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు.