28 శాతం జీఎస్టీ పై ధ్వజ మెత్తిన టీ-ఫిలించాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షడు ఆర్.కె గౌడ్

  • IndiaGlitz, [Wednesday,June 28 2017]

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఫిలిం ఇండ‌స్ర్టీ పై 28 శాతం జీఎస్ టీ విధిస్తు ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విధానంపై తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ తీవ్రంగా ఖండించారు. సినిమా అనేది సామాన్యుల‌కు , మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు రెండు గంట‌ల వినోందం అందించేది. అలాంటి సినిమాకు 28 శాతం జీఎస్ టీ విధించ‌డం అమానుషం. ఇప్పుడు చిన్న సినిమాకు 7 శాతం ట్యాక్స్, పెద్ద సినిమాకు 15 శాతం ట్యాక్స్, డ‌బ్బింగ్ సినిమాకు 20 శాతం ట్యాక్స్ ఉండేది. వాట‌న్నింటికీ క‌లిపి ఒకేలా 28 శాతం జీఎస్టీ చేయ‌డం స‌బ‌బు కాదు. కాబ‌ట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాలి. 10 శాతం జీఎస్ టీ చేయాల్సింది గా డిమాండ్ చేస్తున్నా. క‌మ‌ర్శియ‌ల్ గా ఉండే క్ల‌బ్స్ , క్యాసీనోలు, గుర్ర‌పు రేసుల‌కు విధించిన విధంగా, సినిమా ఇండ‌స్ర్టీ పై భారం మోప‌డం వ‌ల్ల చిన్న సినిమాలు నష్ట‌పోతాయి.
తాజాగా మ‌ళ్లీ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని రాష్ర్ట హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ఇండ‌స్ర్టీలో ఉండే 4.5 సోకాల్డ్ కార్పోరేష‌న్ లో ప‌ద్ద‌తిని తీసుకురావ‌డం దుర‌దృష్ట క‌రం. బిగ్‌ స్క్రీన్‌ టిక్కెట్‌ ధరలు రూ.300 అవుతుండ‌గా, మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధర రూ. 200లకు చేరనుంది. సాధారణ ఏసీ థియేటర్‌లో బాల్కనీ టిక్కెట్‌ ధరను రూ. 120 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ టిక్కెట్టు ధర రూ.80 నుంచి 100 వరకూ ఉంది. కనీస టిక్కెట్టు ధరను రూ. 40గా నిర్ణయించారు. ఇంతవరకూ ఇది రూ. 20గా ఉంది. దీంతో సినిమా వినోదం మ‌ధ్య‌త‌ర‌గ‌తి..దిగువ త‌ర‌గ‌తి కుటుంబాల‌కు భారం కానుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణం ఈ ధ‌ర‌లను త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే సినిమా ఇండ‌స్ర్టీని పీడిస్తోన్న థియేట‌ర్ లీజ్ విధానం, డిజిట‌ల్ దోపీడి, రూ7 మెయింట‌నెన్స్ వ‌ల్ల చిన్న సినిమాల‌కు భారీ గా న‌ష్ట‌పోతాయని ధ్వ‌జ‌మెత్తారు.

More News

ఈనెల 30న 'కదిలే బొమ్మల కథ'

శ్రీమతి మేరుగు బతుకమ్మ ఆశీస్సులతో తరుణిక ఆర్స్ట్ పతాకంపై అజయ్ నిర్మిస్తోన్న చిత్రం 'కదిలే బొమ్మల కథ'.

యాక్షన్ కింగ్ అర్జున్ 'కురుక్షేత్రం' మూవీ టీజర్ కు రెస్పాన్స్ అదుర్స్

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ప్రతిష్టాత్మక 150వ సినిమా కురుక్షేత్రం టీజర్ డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే 2 మిలియన్ డిజిటిల్ వ్యూస్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజ హెగ్డే

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్-ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇటీవల ప్రారంభమై.. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది.

'డీజే' పైరసీపై సైబర్ పోలీసులకు పిర్యాదు చేసిన దిల్ రాజు

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్'.

విశాల్ మూవీ మెయిన్ పాయింట అదేనంట...

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ, నటిస్తున్న విశాల్ ఇప్పుడు మిస్కిన్ దర్శకత్వంలో `తుప్పరివాలన్` అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు మిత్రన్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో `ఇరుంబు తిరై` అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.