జి.ఎస్.టి. వల్ల తెలుగు సినిమాకు నష్టం జరుగుతుంది...తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ఆర్.కె.గౌడ్

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కి ఎటువంటి న‌ష్టం క‌లిగిన‌ నేనున్నానంటు స్పందించే తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ చైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ ఇటీవ‌ల‌ కేంద్ర‌ ఆర్థిక‌ శాఖ‌మంత్రి సినిమా వినోద‌పు ప‌న్ను పెంచుట‌ను నిర‌సిస్థూ విలేక‌రుల‌ స‌మావేశం ఎర్పాటు చేయ‌డం జ‌రిగింది ఈ సంధ‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ కేంద్ర‌ ప్ర‌భుత్వం లోని ఆర్థిక‌ శాఖ‌మంత్రి గారు జి.ఎస్.టి. ట్యాక్స్ 28% ని సినిమా ఇండ‌స్ట్రీ పైన‌ పెంచారు గ‌తంలో 15% కార్పోరేష‌న్ లో పెద్ద‌ సినిమాకి ఉండేది చిన్న‌ సినిమాకి 7% ఉండేది 20% డ‌బ్బింగ్ సినిమాకి ఉండేది ఇలా ఉన్న‌ రోజుల‌లోనే చాలా సినిమా థియేట‌ర్లు ప్రేక్ష‌కులు సినిమాలు చూడ‌క‌ 2 రాష్ట్రాల‌లో కొన్ని వంద‌ల‌ థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి ఇప్పుడు అమాంతంగా టోట‌ల్ అన్ని సినిమాల‌కు ఒకే ట్యాక్స్ 28% విధించ‌డం చాలా అన్యాయం దాదాపు 15000 వేల‌ మంది డైరెక్ట్ గాను 26000 వేల‌ మంది ఇన్ డైరెక్ట్ గాను సినిమా థియేట‌ర్ల‌ మీద‌ జీవిస్తున్నారు మొత్తం ఇండ‌స్ట్రీ అలాగే ఇండ‌స్ట్రీ లో ఉన్న‌ సిని నిర్మాత‌లు,ద‌ర్శ‌కులు,50 వేల‌ మంది సిని కార్మికులు అంద‌రు తీవ్రంగా న‌ష్ట‌పోయే ఆస్కారం ఉంది.

ఐ.పి.ఎల్,గుర్ర‌పు పందాలు,క్యాసినోల‌కు,రిక్రియేష‌న్ క్ల‌బ్స్ కి పెంచిన‌ విధంగా సామాన్యుడు వినోదంగా భావించే సినిమా పైన‌ పెంచి సామాన్యుల‌కు దూరం చేయ‌డం ఇండ‌స్ట్రీ లో ఇంకా మిగిలి ఉన్నా సినిమా థియేటర్స్ మూసేసే ప‌రిస్థితి దాప‌రిస్తుంది దీనిపైన‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌రుపున‌ శ్రీ క‌ల్వ‌కుంట్ల‌ తార‌క‌రామారావు గారు (కె.టి.ఆర్.)గారు డిల్లీలో ఆర్థిక‌ మంత్రిని క‌లిసి రిప్ర‌జెంటెషన్ కూడా ఫిల్మ్ ఇండ‌స్ట్రీకీ ట్యాక్స్ విష‌యంలో మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోర‌డం జ‌రిగింది అదే హింది లో ఉన్న‌ 35% ట్యాక్స్ ని త‌గ్గించి 28% చేయ‌డం తెలుగు రీజిన‌ల్ సినిమాని నేష‌న‌లైజ్డ్ హింది సినిమాని ఒకే ట్యాక్స్ చేయ‌డం క‌ర‌క్ట్ కాదు ఈ మ‌ద్య‌లో రిలీజ్ అయిన‌ బాహుబ‌లి లాంటి సినిమాల‌పైన‌ కోట్ల‌ రూపాయాలు వ‌సూలు అవుతున్నాయ‌ని మొత్తం సౌత్ ఇండియా సినిమాల‌పైన‌ ట్యాక్స్ పెంచ‌డం సౌత్ ఇండియాలో ఇలాంటి సినిమాలు ఎన్ని వ‌స్తాయి!! ఎప్పుడో రేర్ గా వ‌చ్చే సినిమాల‌ను ద్రుష్టిలో పెట్టుకొని కేంద్ర‌ ఫైనాన్స్ మినిష్ట‌ర్ కు తెలుగు సినిమాల‌పైన‌ ట్యాక్స్ ని పెంచడం దుర‌ద్రుష్ట‌క‌రం.

మ‌న‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌రుపున‌ కె.టి.ఆర్. గారు ట్యాక్స్ త‌గ్గించాల‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని కోరడం జ‌రిగింది దీన్ని ప‌రిశీలించి త‌ప్ప‌కుండా తెలుగు రాష్ట్రాల‌ పై విధించిన‌ ట్యాక్స్ ని త‌క్ష‌న‌మే ఎత్తివేసి ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి న్యాయం చేస్తూ సామాన్య‌ ప్రేక్ష‌కులు సినిమాలు చూసే విధంగా ఉండేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర‌ ఫైనాన్స్ మినిష్ట‌ర్ ని కోరుచున్నాము ఇది వ‌ర‌మించుకోక‌పోతే మొత్తం ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఒక‌ తాటిపై తెచ్చి నిర‌స‌న‌ తెలుపుతూ డిల్లీలో బారి ఎత్తున‌ ఉద్య‌మానికి కూడా వెన‌కాడ‌ము....

ఇట్లు
ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ చైర్మ‌న్
సాయి వెంక‌ట్ సెక్ర‌ట‌రి

More News

యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేసుకున్న కిక్ శ్యామ్ చిత్రం 'వాడు వస్తాడు'

కిక్ ఫేమ్ శ్యామ్ తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం 'కవియాన్'.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న'ఆచారి అమెరికా యాత్ర'

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న

విశాల్ తో వరలక్ష్మి...

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ కు,శరత్ కుమార్ తనయ వరలక్ష్మికి మధ్య ఏదో నడుస్తుందని,

బెల్లంకొండతో మెహరీన్...

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

కొత్త సినిమా ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్...

నాలుగు దశాబ్దాల నటనానుభవం ఉన్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు