Entrance Exmas: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్ పేరు మార్పు
Send us your feedback to audioarticles@vaarta.com
వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో నిర్వహించే పరీక్షల షెడ్యూలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ పేరును 'టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)'గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తులు, నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలిపింది.
పరీక్షల షెడ్యూల్.. నిర్వహించే యూనివర్సిటీల వివరాలు.
మే 6 : తెలంగాణ ఈసెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ చేపట్టనుంది.
మే 9 నుంచి 11 వరకు: ఈఏపీసెట్ ఇంజినీరింగ్.. మే 12, 13 వరకు: అగ్రికల్చరల్ అండ్ ఫార్మా పరీక్షలు జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరగనుంది.
మే 23: బీఈడీ కోర్సులో ప్రవేశాలకు టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుంది.
జూన్ 3: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ లా సెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
జూన్ 4, 5: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్ ఐసెట్ పరీక్ష కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది.
జూన్ 6 నుంచి 8వరకు: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పీజీఈసెట్ పరీక్ష జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరగనుంది.
జూన్ 10 నుంచి 13 వరకు: బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ పరీక్ష శాతవాహన యూనివర్సిటీ నిర్వహణ చేపట్టనుంది.
పదో తరగతి, ఇంటర్, జేఈఈ పరీక్షలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షెడ్యూల్‌ను రూపొందించింది. మార్చి 19వ తేదీతో ఇంటర్ పరీక్షలు పూర్తి కానున్నాయి. ఏప్రిల్‌లో జేఈఈ పరీక్షలు పూర్తి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments