Entrance Exmas: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్ పేరు మార్పు

  • IndiaGlitz, [Thursday,January 25 2024]

వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో నిర్వహించే పరీక్షల షెడ్యూలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ పేరును 'టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)'గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తులు, నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్‌ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలిపింది.

పరీక్షల షెడ్యూల్.. నిర్వహించే యూనివర్సిటీల వివరాలు.

మే 6 : తెలంగాణ ఈసెట్‌ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ చేపట్టనుంది.

మే 9 నుంచి 11 వరకు: ఈఏపీసెట్ ఇంజినీరింగ్.. మే 12, 13 వరకు: అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మా పరీక్షలు జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరగనుంది.

మే 23: బీఈడీ కోర్సులో ప్రవేశాలకు టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుంది.

జూన్‌ 3: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ లా సెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

జూన్‌ 4, 5: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది.

జూన్‌ 6 నుంచి 8వరకు: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పీజీఈసెట్‌ పరీక్ష జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరగనుంది.

జూన్‌ 10 నుంచి 13 వరకు: బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించే పీఈసెట్‌ పరీక్ష శాతవాహన యూనివర్సిటీ నిర్వహణ చేపట్టనుంది.

పదో తరగతి, ఇంటర్, జేఈఈ పరీక్షలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షెడ్యూల్‌ను రూపొందించింది. మార్చి 19వ తేదీతో ఇంటర్ పరీక్షలు పూర్తి కానున్నాయి. ఏప్రిల్‌లో జేఈఈ పరీక్షలు పూర్తి కానున్నాయి.

More News

అవును.. గుంపు మేస్త్రీనే.. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

తనను గుంపు మేస్త్రీ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవును నేను మేస్త్రీనే.. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్మించిన మేస్త్రీనే అని కౌంటర్ ఇచ్చారు.

'భారతరత్న' పురస్కారం ఎప్పుడు ప్రారంభమైంది.. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు..?

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'. ఈ అవార్డును 1954 జనవరి 2న, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ప్రారంభించారు. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అసాధారణ సేవలందించిన

Prof Kodandaram: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్‌

గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నియమించారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమరుల్లా ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahendar Reddy) నియామకం అయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై(Tamilisai) ఆమోదం తెలిపారు.

వైఎస్ కుటుంబాన్ని సీఎం జగనే చీల్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబం చీలింది